ప్రణబ్ ముఖర్జీకి లంగ్ ఇన్ఫెక్షన్!

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయని, దీనితో ఆయన ఆరోగ్యం కాస్త దిగజారిందని ఆర్మీ రీసెర్చ్, రిఫరల్ హాస్పిటల్ బుధవారం వెల్లడించింది. బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరిన ముఖర్జీకి ఇప్పటికీ వెంటిలేటర్ సపోర్ట్‌‌తోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 10న బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాగా, శ్రేయోభిలాషులు ఆశీస్సులు, వైద్యుల కృషితో తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆయన కోలుకునే […]

Update: 2020-08-19 03:43 GMT

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయని, దీనితో ఆయన ఆరోగ్యం కాస్త దిగజారిందని ఆర్మీ రీసెర్చ్, రిఫరల్ హాస్పిటల్ బుధవారం వెల్లడించింది. బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరిన ముఖర్జీకి ఇప్పటికీ వెంటిలేటర్ సపోర్ట్‌‌తోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 10న బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాగా, శ్రేయోభిలాషులు ఆశీస్సులు, వైద్యుల కృషితో తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆయన కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.

Tags:    

Similar News