తెరపైకి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ ‘రాధే శ్యామ్’తో అలరించబోతున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో దీపికా పదుకొనేతో కలిసి రికార్డులు తిరగ రాసే మరో సినిమాను తీసుకొస్తుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. కేజీఎఫ్ సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 22వ సినిమా చేయనున్నాడట ప్రభాస్. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు రూట్ […]

Update: 2020-08-12 03:50 GMT

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ ‘రాధే శ్యామ్’తో అలరించబోతున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో దీపికా పదుకొనేతో కలిసి రికార్డులు తిరగ రాసే మరో సినిమాను తీసుకొస్తుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. కేజీఎఫ్ సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 22వ సినిమా చేయనున్నాడట ప్రభాస్. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు రూట్ క్లియర్ అయిందని సమాచారం.

ప్రశాంత్ నీల్.. తన తొలి సినిమా ‘ఉగ్రమ్’ తర్వాత నుంచే ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. తాజాగా ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. సినిమా కథ అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరగనుండగా.. ప్రజల హక్కుల కోసం మాఫియాతో పోరాడే హీరోగా ప్రభాస్ కనిపించనున్నట్టు టాక్.

కాగా, ఈ సినిమా షూటింగ్ 2022లో ప్రారంభం కానుండగా.. ఆ లోపు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2తో పాటు ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మూవీ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇటు ప్రభాస్ కూడా ‘రాధే శ్యామ్’ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో చిత్రం పూర్తి చేయనున్నారు.

Tags:    

Similar News