పీపీఎఫ్ వడ్డీ రేట్లు 46 ఏళ్ల కనిష్టానికి తగ్గే అవకాశం!
దిశ, సెంట్రల్ డెస్క్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)తో ఉద్యోగులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. పీపీఎఫ్ వడ్డీ రేట్లు బాగుంటే ఉద్యోగులకు ఊరటగా ఉంటుంది. అయితే, జూన్ నెల చివరికి ప్రభుత్వం జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)తో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు అన్నీ తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. […]
దిశ, సెంట్రల్ డెస్క్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)తో ఉద్యోగులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. పీపీఎఫ్ వడ్డీ రేట్లు బాగుంటే ఉద్యోగులకు ఊరటగా ఉంటుంది. అయితే, జూన్ నెల చివరికి ప్రభుత్వం జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)తో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు అన్నీ తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 140 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఎక్కువ ఆదరణ ఉన్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పైన వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లతో 7.1 శాతానికి తగ్గించారు. అలాగే.. పదేళ్ల బాండ్‌పై జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి వడ్డీ 6.42 శాతంగా ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకూ బాండ్లపై వడ్డీ ఆదాయం సగటున 6.07 శాతం ఉంటే, ప్రస్తుతం అది 5.85 శాతంగా ఉంది. అంటే.. జులై నుంచి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సైతం దీనికిమించిన వడ్డీ రేటు ఇవ్వట్లేదు. దీనివల్ల పీపీఎఫ్, సుకన్య పథకాల్లో పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌ను 1968లో ప్రారంభించారు. అప్పుడు వార్షిక వడ్డీ రేటు 4.8 శాతంగా ఉండేది. తర్వాత ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా వడ్డీ రేట్లు పెరుగుతూ వచ్చాయి. 1986 నుంచి 2000 మధ్య 12 శాతానికి చేరుకున్నాయి. 2016 ఏప్రిల్‌లో ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికగా మార్చింది. అంతకుముందు ప్రతి ఏడాది సమీక్షించేది. ఈసారి జూలై – సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేటు 7 శాతం కంటే తక్కువకు చేరుకోవచ్చు. అంటే 1974 సంవత్సరంతో సమానమైన 46 ఏళ్ల కనిష్టానికి చేరుకునే అవకాశాలున్నాయి.