Flight Ticket: బుకింగ్స్ షురూ.. Rs.1199కే విమాన ప్రయాణం.. డిటైల్స్ ఇవే
Flight Ticket: సంక్రాంతికి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇండిగో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 1119 రూపాయలకే విమాన ప్రయాణం కల్పిస్తోంది. ఈ స్పెషల్ గేట్ అవే సేల్(Gate Away Sale) జనవరి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అటు విదేశీ ప్రయాణాలపై కూడా భారీ డిస్కౌంట్ ఇస్తోంది. మరి ఈ సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ విమాన సంస్థల్లో ఒకటైన ఇండిగో (IndGo) ఎయిర్ లైన్స్ మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. గురువారం జనవరి 9వ తేదీన స్పెషల్ గేట్ అవే సేల్(Gate Away Sale) ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు టికెట్ రేట్ల(Flight Ticket)తో పాటు పలు సర్వీసులపై ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే. జనవరి 9వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రధాన ట్రావెల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రతి ఒక్కరు ఫ్లైట్ జర్నీ చేసేలా అందుబాటు ధరలో టికెట్లు ఉండేలా ఇండిగో(IndGo) ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఆఫర్ లో భాగంగా దేశీయ విమాన ప్రయాణం రూ. 1119కే కల్పిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్ ధరలు రూ. 449 నుంచి మొదలవుతున్నాయి. అయితే టికెట్ బుకింగ్ చేసుకున్న 15 రోజుల్లోపు బయలుదేరే ఫ్లైట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణం చేసే దేశ ప్రజలకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
గెట్ అవే సేల్(Gate Away Sale) ద్వారా పలు సర్వీసులపైన డిస్కౌంట్ కల్పిస్తోంది. ఎంపిక చేసిన రూట్లలో దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అదనపు బ్యాగేజీపై ప్రీపెయిడ్ చెల్లింపులకు 15శాతం డిస్కౌంట్ పొందవచ్చని ఇండిగో తెలిపింది. అదనంగా దేశీయ, విదేశీ విమానాల్లో సీట్ ఎంపికలు కూడా 15శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే జర్నీ మరింత సౌకర్యవంతంగా ఉండాలని కోరుకునేవారు ఎక్స్ఎల్ సీట్ల సెలక్షన్ చేసుకునేందుకు ఆఫర్ ఇస్తోంది. డొమెస్టిక్ ఫ్లైట్లో ఎక్సెల్ సీట్ల కోసం రూ. 599 నుంచి ధర ప్రారంభమవుతుంది. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో అయితే రూ. 699గా ఉంది. ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్ ఎయిర్ పోర్టులో వేగంగా సేవలందించేందుకు ఉన్న చార్జీలపై 50శాతం ఇస్తున్నట్లు ఎండిగో తెలిపింది