'మీకు 2 రోజుల గడువిస్తున్నా.. చేయకపోతే కలెక్టర్ కు చెప్తా'

దిశ, ఆదిలాబాద్: తాంసి మండలంలోని జామిడి గ్రామంలో గత ఆరు నెలల క్రితం పంటపొలంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అప్పటి నుంచి విద్యుత్ వైర్లు పొలంలోనే పడి ఉన్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై జమిడి గ్రామ యువ రైతు గడ్డం నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేం ఇబ్బందులు పడుతున్నామని, రెండో పంట వేయాలంటే విద్యుత్ సరఫరా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామ సర్పంచ్ కుంట కేశవ్ రెడ్డి మాట్లాడుతూ.. […]

Update: 2021-10-24 02:52 GMT

దిశ, ఆదిలాబాద్: తాంసి మండలంలోని జామిడి గ్రామంలో గత ఆరు నెలల క్రితం పంటపొలంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అప్పటి నుంచి విద్యుత్ వైర్లు పొలంలోనే పడి ఉన్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై జమిడి గ్రామ యువ రైతు గడ్డం నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేం ఇబ్బందులు పడుతున్నామని, రెండో పంట వేయాలంటే విద్యుత్ సరఫరా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామ సర్పంచ్ కుంట కేశవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదన్నారు. మరో రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

Tags:    

Similar News