విద్యుత్ ఛార్జీల పెంపు ఉండేనా?
దిశ, హైదరాబాద్ తెలంగాణ డిస్కంలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సాహం లేదా కరెంటు చార్జీల పెంపునకు అవకాశం కల్పించాలని డిస్కం సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.విద్యుత్ చార్జీలు పెంచితే వచ్చే ఎదురయ్యే పరిణామాలు, ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే రాష్ట్ర ఖజానాపై ఎంతమేర భారం పడనుందోనని సీఎం ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. రానున్నది వేసవి కాలం కావడంతో ఇళ్లు, ఆఫీసులు, ఊర్లల్లో రైతుల కరెంటును ఎక్కువగా […]
దిశ, హైదరాబాద్
తెలంగాణ డిస్కంలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సాహం లేదా కరెంటు చార్జీల పెంపునకు అవకాశం కల్పించాలని డిస్కం సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.విద్యుత్ చార్జీలు పెంచితే వచ్చే ఎదురయ్యే పరిణామాలు, ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే రాష్ట్ర ఖజానాపై ఎంతమేర భారం పడనుందోనని సీఎం ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. రానున్నది వేసవి కాలం కావడంతో ఇళ్లు, ఆఫీసులు, ఊర్లల్లో రైతుల కరెంటును ఎక్కువగా వినియోగిస్తారు. ఒకవేళ చార్జీలు పెంచితే ప్రజల స్పందన ఎలా ఉంటుందనే దానిపై అధికారుల అభిప్రాయం కనుకుంటారని సమాచారం.మొన్నే ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేసిన ప్రభుత్వం మళ్లీ విద్యుత్ చార్జీల పెంపునకు సంసిద్ధతను కనబరుస్తున్న అనేది చూడాలి. కాగా, ఏటా డిస్కంల ఆదాయ వ్యయాల్లో అంతరం పెరిగిపోతుందని, ఇలానే ఉంటే వచ్చే ఏడాది ఈ అంతరం రూ.11వేల కోట్లకు చేరుకుంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది.