Megastar:చిరు కొత్త లుక్ వైరల్.. మ‌రోసారి పాత చిరంజీవిని గుర్తు చేశారు!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2024-12-25 12:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు పెరిగేకొద్దీ ఆయన ఇంకా యంగ్‌గా అవుతున్నారంటారు మెగా ఫ్యాన్స్. తాజాగా బయటికొచ్చిన ఫొటోస్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. లేటెస్ట్ ఫొటో షూట్‌లో మెగాస్టార్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు మ‌రోసారి పాత రోజుల‌ను గుర్తుకు తెచ్చాయి. తాజా ఫొటోల్లో చిరు స్ట‌న్నింగ్ లుక్ చూస్తే.. ఈయ‌న‌కు వ‌య‌సు పెర‌గ‌డం లేదు.. త‌గ్గుతుంది అని అనిపించ‌డం ఖాయం. మెగా స్టార్‌(Mega Star) న‌వ యువ‌కుడిలా క‌నిపిస్తున్నారంటూ మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. స్టైలిష్ ఫొటోలు చూసి 69 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ బాస్‌ని తెగ పొగిడేస్తున్నారు.  ప్రస్తుతం చిరు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత యువ ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయ‌నున్నారు.

 

Tags:    

Similar News