చిన్నారుల ప్రతిభ చూస్తే వావ్ అనాల్సిందే

చిన్నారి విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశారు.

Update: 2024-12-25 12:45 GMT

దిశ ,అచ్చంపేట రూరల్: చిన్నారి విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశారు. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని తమ సృజనకు పదును పెట్టారు. పట్టణంలోని ఇచ్‌డయాన్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న రేసోజు విఘ్నేష్, 6వ తరగతి చదువుతున్న నాగేందర్‌ యాదవ్, 4వ తరగతి చదువుతున్న సిరిశివజ తెల్లటి కాగితాలను సేకరించి, వాటిపై రంగులు దిద్ది క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేశారు. దానికి రంగు రంగు లైట్లను అమర్చారు. అలాగే శాంతా క్లాజ్‌ బొమ్మను తయారు చేశారు. చిన్నారుల ప్రతిభను పలువురు అభినందించారు.


Similar News