వైద్యం వికటించి మహిళ మృతి

వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-12-25 15:51 GMT

దిశ ,నాగర్ కర్నూల్ : వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన రాములమ్మ (25) కు నాలుగు నెలల క్రితం ప్రసవం జరిగి పుట్టిన బిడ్డ మృతి చెందాడు. ప్రస్తుతం రాములమ్మకు కడుపునొప్పి రావడంతో..బుధవారం రాఘవేంద్ర హాస్పిటల్ కు తీసుకువచ్చారు. రెండు గంటల పాటు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో..మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళన కు దిగారు.


Similar News