మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మురళీ నాయక్
ఇనుగుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని
దిశ,ఇనుగుర్తి (నెల్లికుదురు): ఇనుగుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. స్థానిక పీహెచ్సీకి ప్రభుత్వం మంజూరు చేసిన అంబులెన్స్ ను ఎమ్మెల్యే డీఎం అండ్ హెచ్ ఓ మురళీధర్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో ఆసరా కావడానికి అంబులెన్స్ అవసరమని తాను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహను కోరగా మంజూరు అయిందని తెలిపారు. రాబోయే రోజుల్లో 30 పడకల ఆసుపత్రిగా స్థానిక పీహెచ్సీని అభివృద్ధి చేస్తానన్నారు.
త్వరలోనే తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సురేష్, మండల పార్టీ అధ్యక్షులు కూరెల్లి సతీష్, ఇనుగుర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి, కొట్టం మహేందర్, కొట్టం రాము, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బైరు అశోక్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చిన్నాలకట్టయ్య, వల్లముల మురళి, కొలిపాక నారాయణ చేట్టబోయిన యాకయ్య, బండి వెంకన్న, గట్టిగోర్ల వెంకన్న, కొనతం ప్రభాకర్, రామన్న తదితరులు పాల్గొన్నారు.