కోళ్లఫారాల నిర్వాహకులకు గుడ్ న్యూస్

దిశ, న్యూస్‌బ్యూరో: కోళ్లఫారాల విద్యుత్ బిల్లుల సబ్సిడీకిగాను ప్రభుత్వం రూ.3కోట్ల 11 లక్షలు విడుదల చేసింది. రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని పౌల్ట్రీ ఫాములు 2018-19 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు త్రైమాసికాల్లో వాడుకున్న విద్యుత్‌కు చెల్లించిన బిల్లులను ప్రస్తుతం రీయింబర్స్ చేస్తూ ప్రభుత్వం పాలనా అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘పౌల్ట్రీ ఫాములకు సహాయం’ […]

Update: 2020-05-22 09:25 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కోళ్లఫారాల విద్యుత్ బిల్లుల సబ్సిడీకిగాను ప్రభుత్వం రూ.3కోట్ల 11 లక్షలు విడుదల చేసింది. రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని పౌల్ట్రీ ఫాములు 2018-19 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు త్రైమాసికాల్లో వాడుకున్న విద్యుత్‌కు చెల్లించిన బిల్లులను ప్రస్తుతం రీయింబర్స్ చేస్తూ ప్రభుత్వం పాలనా అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘పౌల్ట్రీ ఫాములకు సహాయం’ అనే పథకం కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు జీవోలో వెల్లడించారు.

Tags:    

Similar News