టెన్నిస్ ప్లేయర్లకు నాసిరకం ఆహారం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్-2021 కోసం మెల్‌బోర్న్‌కు చేరుకున్న టెన్నిస్ క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చార్టెడ్ ఫైట్లలో వచ్చిన క్రీడాకారులు, సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మొత్తం 47మందిని క్వారంటైన్‌కు తరలించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం క్రీడాకారులను 5గంటల ప్రాక్టీస్‌కు అనుమతించాల్సి ఉంది. కరోనా కారణంగా ప్రాక్టీస్ రద్దు చేయడమే కాకుండా హోటల్ గదులకే పరిమితం చేశారు. ఇప్పటికే కఠిన క్వారంటైన్‌తో ఇబ్బంది పడుతున్న టెన్నిస్ ప్లేయర్లకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. మెల్‌బోర్న్‌లో […]
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్-2021 కోసం మెల్‌బోర్న్‌కు చేరుకున్న టెన్నిస్ క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చార్టెడ్ ఫైట్లలో వచ్చిన క్రీడాకారులు, సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మొత్తం 47మందిని క్వారంటైన్‌కు తరలించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం క్రీడాకారులను 5గంటల ప్రాక్టీస్‌కు అనుమతించాల్సి ఉంది. కరోనా కారణంగా ప్రాక్టీస్ రద్దు చేయడమే కాకుండా హోటల్ గదులకే పరిమితం చేశారు. ఇప్పటికే కఠిన క్వారంటైన్‌తో ఇబ్బంది పడుతున్న టెన్నిస్ ప్లేయర్లకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. మెల్‌బోర్న్‌లో తమకు కేటాయించిన హోటల్ యాజమాన్యం నాసిరకం ఆహారం అందించడంపై పలువురు క్రీడాకారులు మండిపడుతున్నారు.
స్పెయిన్‌కు చెందిన వరల్డ్ నెం 15 ప్లేయర్ కారెనో బస్టా తనకు సరఫరా చేసిన ఆహారం ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు ఇచ్చిన సలాడ్, ఆపిల్, జూస్ కప్‌తోపాటు ‘నిజమేనా?’ అంటూ క్యాప్షన్‌ను జోడించారు. అలాగే, ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్ నంబర్ 28 క్రీడాకారిణి క్వారంటైన్‌లో అందిస్తున్న ఆహారాన్ని ఇప్పటికే తిరస్కరించారు. మెక్‌డొనాల్డ్ నుంచి తెప్పించుకుంటున్న ఆహారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యేక చార్టెడ్ ఫైట్లలో వచ్చిన క్రీడాకారులు, సిబ్బందిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.