ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు.. ఇబ్బందుల్లో విద్యార్థులు
దిశ, గోదావరిఖని: ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయా..? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు పంపించాలంటే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గి, హాజరు శాతం లేక కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతుండగా, మరి కొన్ని పాఠశాలలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. […]
దిశ, గోదావరిఖని: ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయా..? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు పంపించాలంటే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గి, హాజరు శాతం లేక కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతుండగా, మరి కొన్ని పాఠశాలలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల (6వ తరగతి నుండి 10వ తరగతి) ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడింది. కానీ, నేడు పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థిని-విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరైన భోజనశాల లేకపోవడంతో చెట్ల కింద భోజనాలు చేస్తున్నారు. పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా.. కనీస సౌకర్యాలైన టాయిలెట్స్ కూడా లేకపోవడంతో.. ఆరుబయటే కాలకృత్యాలు చేయాల్సి వస్తోందని స్టూడెంట్స్ వాపోతున్నారు.
రానురాను ప్రభుత్వ పాఠశాలలు అగమ్యగోచరంగా మారుతుండడంతో.. విద్యార్థులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విద్య కనుమరుగవుతున్నదని.. పేరెంట్స్ ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు సర్కారు బడుల సమస్యలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
2020-2021వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఎటువంటి బడ్జెట్ విడుదల కాలేదు. దీని కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. దీనిపై సమీక్షించి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. -చెరుకూరి ఇజ్రారైర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు.