పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. #pklove అంటూ..

దిశ, డైనమిక్ బ్యూరో : గత కొన్ని రోజులుగా పూనమ్ కౌర్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మాట్లాడుతున్న క్రమంలో కొందరు రాజకీయ నాయకులు పూనమ్ కౌర్ తో గతంలో పవన్‌కి సంబంధాలున్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రోజులక్రితం ‘మా’ ఎన్నికల బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్‌కి సపోర్ట్ చేస్తూ అన్ని విషయాలు బయటపెడుతానంటూ ట్వీట్ చేసి మరోసారి చర్చనీయాంశమయ్యారు. […]

Update: 2021-10-08 02:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గత కొన్ని రోజులుగా పూనమ్ కౌర్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మాట్లాడుతున్న క్రమంలో కొందరు రాజకీయ నాయకులు పూనమ్ కౌర్ తో గతంలో పవన్‌కి సంబంధాలున్నాయంటూ విమర్శలు చేస్తున్నారు.

అంతేకాకుండా కొన్ని రోజులక్రితం ‘మా’ ఎన్నికల బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్‌కి సపోర్ట్ చేస్తూ అన్ని విషయాలు బయటపెడుతానంటూ ట్వీట్ చేసి మరోసారి చర్చనీయాంశమయ్యారు. తాజాగా, పూనమ్​ కౌర్ ట్విట్టర్​లో కొన్ని ఫొటోలు ఫోస్ట్ చేశారు. దీనిపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఫొటోలతో పాటు #pklove అని హ్యాష్ టాగ్‌తో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతుండటంతో పాటు ఎందుకలా పెట్టారని ప్రశ్నిస్తున్నారు.

బ్యాకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై IMPS ద్వారా రూ.5 లక్షలు బదిలీ చేయొచ్చు

Tags:    

Similar News