వైభవంగా నృసింహ జయంతి ఉత్సవం

దిశ, ధర్మపురి ; నవ నృసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ప్రాచీణ పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నృసింహ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ లక్ష్మీనృసింహ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి (యోగ, ఉగ్ర) వారలకు ఉపంచోపనిషత్తులతో మహా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలను చేపట్టారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు స్వామి వారి జయంతి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపట్టారు. వేదపండితులు […]

Update: 2021-05-25 08:37 GMT

దిశ, ధర్మపురి ; నవ నృసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ప్రాచీణ పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నృసింహ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ లక్ష్మీనృసింహ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి (యోగ, ఉగ్ర) వారలకు ఉపంచోపనిషత్తులతో మహా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలను చేపట్టారు.

ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు స్వామి వారి జయంతి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపట్టారు. వేదపండితులు బోజ్జ రమేష్​ శర్మ, బోజ్జ సంపత్, రాజగోపాల్, సంతోష్ శర్మ, ఉప ప్రధాన అర్చకుడు నేరెల్ల శ్రీనివాస చారి, ముఖ్య అర్చకుడు నంబి శ్రీనివాస చారి, అర్చకులు నంబి మూర్తి, వంశీ, కల్యాణ్‌లు స్వామి వారి జయంతి కార్యక్రమాలను నిర్వహించగా ఇందులో దేవస్థాన సూపరింటెండెంట్​ కిరణ్​కుమార్, సీనియర్ అసిస్టెంట్​అలువాల శ్రీనివాస్, టెంపుల్ ఇన్స్‌పెక్టర్​ రాజు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన నవరాత్రోత్సవాలు :

ధర్మపురి క్షేత్రంలో18వ తేది నుండి మొదలైన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి నవరాత్రోత్సవాలు మంగళవారం జరిగిన శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి ఉత్సవంతో ముగిసినట్లు అర్చకులు తెలిపారు.

Tags:    

Similar News