జూన్ 19న 18 రాజ్యసభ సీట్లకు పోలింగ్
న్యూఢిల్లీ: రాజ్యసభలోని 18 సీట్లకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలు మార్చిలో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి, కఠిన లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా, లాక్‌డౌన్ ఆంక్షలు చాలా వరకు సడలడంతో ఎన్నికల తేదీని ప్రకటించింది. ఈ 18 సీట్లల్లో నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ల నుంచి, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుంచి మూడు సీట్లు, జార్ఖండ్ నుంచి రెండు సీట్లు, మేఘాలయ, మణిపూర్‌ల నుంచి ఒక్కో సీటుకు ఎన్నికలు […]
న్యూఢిల్లీ: రాజ్యసభలోని 18 సీట్లకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలు మార్చిలో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి, కఠిన లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా, లాక్‌డౌన్ ఆంక్షలు చాలా వరకు సడలడంతో ఎన్నికల తేదీని ప్రకటించింది. ఈ 18 సీట్లల్లో నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ల నుంచి, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుంచి మూడు సీట్లు, జార్ఖండ్ నుంచి రెండు సీట్లు, మేఘాలయ, మణిపూర్‌ల నుంచి ఒక్కో సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీట్ల ఎన్నికలు జూన్ 19న ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్నాయి. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియలో సామాజిక దూరాన్ని పాటించడంలాంటి కరోనా జాగ్రత్తల అమలు పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలను ఆదేశించింది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు ఆదే రోజు సాయంత్రం వెలువడనున్నట్టు సమాచారం.