YS Sharmila: చెల్లి జోరు.. అన్న బేజారు.. వైఎస్ షర్మిల సరికొత్త వ్యూహం?

ఆంధ్రాలో ఎన్నికలు ముగిసినా అన్నా చెల్లెల్ల పోరు మాత్రం చల్లారలేదు, అని విశ్లేషకులు అంటున్నారు.

Update: 2024-07-05 06:15 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రాలో ఎన్నికలు ముగిసినా అన్నా చెల్లెల్ల పోరు మాత్రం చల్లారలేదు, అని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో వైఎస్ షర్మిల పాత్ర ఎంత ఉందో 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి సైతం వైఎస్ షర్మిల పాత్ర అంతే ఉందని అటు ప్రజలు ఇటు రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిసినా, కాంగ్రెస్‌కు డిపాజిట్ సైతం దక్కకపోయిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మాత్రం పట్టువదలడంలేదని, 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అరోపణల్లో అన్న.. అగ్రనేతల వేటలో చెల్లి..

అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నింధించడానికే సరిపోయిందని,అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం ఇవ్వలేదని పలువురు జగన్‌ను ఎద్దేవ చేస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన తరువాతనైనా ప్రజాసమస్యలపై చర్చిస్తారని అని కుంటే, ఇప్పటికీ వైసీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోందని, అలానే గద్దె దింపిన జగన్‌కు బుద్ధి రాలేదని ప్రజలు మండిపడుతున్నారు.

అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలకు సైతం దర్శనం ఇవ్వాలన్న వైసీపీ అధినేత, కేడర్‌ని సైతం పట్టించుకోని జగన్, నిన్న నెల్లూరు వెళ్లి మరీ రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించారు. టీడీపీపై విమర్శలు కురిపించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుండి వైఎస్ జగన్ టీడీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ ఆరోపణల్లో కాలం గడుపుతుంటే, ఆయన చెల్లి షర్మిల మాత్రం హుందాగా వ్యవహరిస్తూ.. రాజకీయ చందరంగం చాకచక్యంగా ఆడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వైపీపీలో ఉన్న వైఎస్‌ఆర్ అభిమానులకు తిరిగి కాంగ్రెస్ కడువా కప్పేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వైఎస్‌ఆర్ జయంతి పేరుతో వైఎస్ షర్మిల వ్యూహం..

జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. కాగా ఈ ఏడాది తండ్రి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని వైఎస్ షర్మిలా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ వేడుకలను అడ్డుపెట్టుకోని గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ గూటికి చేరిన వైఎస్ఆర్ అభిమాన నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ప్రణాలికలు రూపొందించినట్టు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమె ప్రముఖ సినీ ప్రముఖులకు, కీలక నేతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్టు సమాచారం.

వైసీపీకి తప్పని షర్మిల ముప్పు..

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగైంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టారు. దీనితో పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తన వాక్‌చాతుర్యంతో సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని సైతం రాజకీయంగా ప్రశ్నించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రులలో కాంగ్రెస్‌పై ఆగ్రహం ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అందరు అనుకున్నట్టుగానే ఓడిపోయింది. అయినా వైఎస్ షర్మిల వెనకడుగు వేయకుండా 2029 ఎన్నికలకు పార్టీని బలోపితం చేసేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే వైఎస్ఆర్ వేడుకలను అడ్టుపెట్టుకుని స్వామి కార్యంతోపాటు స్వకార్యం సైతం పూర్తి చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ షర్మిల అనుకున్నట్టుగానే వైసీపీలోని కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరితే వైసీపీకి ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  


Similar News