జగన్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏపీలో రాజకీయ రగడ మొదలైంది.

Update: 2022-09-23 12:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, నందమూరి కుటుంబం భగ్గుమంటోంది. ఇక ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ అంశంలో మరోసారి విమర్శలు గుప్పించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఆ పెద్దమనిషిని అవమానిస్తే కోట్ల మంది ప్రజలను అవమాన పరిచినట్లేనని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం YSR పేరు పెడితే రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ పేరు మారుస్తారు. ఇలా ఒక్కో ప్రభుత్వంలో ఒక్కొక్కరు పేర్లు మార్చుకుంటూ వెళ్తే ఆ మహానుభావులను అవమానపరిచినట్లు అవుతుందన్నారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. తన తండ్రి వైఎస్సార్ నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని, అలాగే ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా మరెవరూ ఆరాధించి ఉండరని జగన్‌ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌కు ఉన్న ఖ్యాతి ప్రపంచంలోనే మరెవరికి లేదని ఆయన వైఎస్సార్ చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700 మంది చనిపోయారని అన్నారు. అలాంటి వైఎస్సార్‌కు మరొకరి ఖ్యాతిని తీసుకొచ్చి ఆపాదించడం సరికాదన్నారు.

ఏపీ రాజకీయాల్లో షర్మిల కామెంట్ల దుమారం:

యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో షర్మిల చేసిన కామెంట్స్ దుమారం రేపుతోంది. ఈ విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని మొదటి నుండి షర్మిల వ్యతిరేకిస్తున్నారు. తాజాగా శుక్రవారం మరోసారి రియాక్ట్ కావడం సంచలనంగా మారింది. అదే సమయంలో నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదనే కామెంట్ చర్చనీయాంశంగా మారింది. జగన్ తన తండ్రిమీద ప్రేమ కొద్ది ఈ పనికి పూనుకున్నాడనే ఆరోపణలు వస్తున్న తరుణంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీతో పాటు టీడీపీలో దుమారం రేగుతోంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్‌ను అవమానించిన షర్మిల

Tags:    

Similar News