పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా సంతోషమే: షర్మిల

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వైఎస్ఆర్ కుమార్తె షర్మిల శుక్రవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు.

Update: 2024-01-05 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వైఎస్ఆర్ కుమార్తె షర్మిల శుక్రవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మొదటిసారి ఖర్గేను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఖర్గే గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా సంతోషమే. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాను. ప్రస్తుతం తనకు ఇవ్వబోయే బాధ్యతలపైనే హైకమాండ్ చర్చిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News