బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మరోసారి టార్గెట్ చేసిన యాక్టర్

తమిళనాడు బీజేపీలో సినీ నటి గాయత్రి రఘురాం వ్యవహారం ఇంకా చల్లారడం లేదు.

Update: 2023-01-28 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు బీజేపీలో సినీ నటి గాయత్రి రఘురాం వ్యవహారం ఇంకా చల్లారడం లేదు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సారధ్యంలో బీజేపీలోని మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తూ ఈ నెల 3న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన గాయత్రి తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. తనపై అన్నామలై కుట్రలు చేస్తున్నారని.. ఆయన సూచలతోనే రోజురోజుకూ ఆయన యూట్యూబ్ ఛానెల్స్ నా గురించి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని ఆరోపించారు. తాను కొంత మందిని వ్యక్తిగతంగా రాత్రిపూట కలుస్తున్నానంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తున్నారంటూ నలుగురు వ్యక్తుల ఫోటోలను గాయత్రి సోషల్ మీడియాలో షేర్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం రేపుతోంది. ఈ ఫోటోలో ఉన్న వారితో తాను సంబంధాలు పెట్టుకున్నట్టు ఫేక్ న్యూస్ వ్యాప్తిచేయిస్తున్నారని, తాను పుకార్లకు బయపడనని చెప్పారు. మీరు నాపై ప్రచారం చేస్తున్న పుకార్లను మా అమ్మ కూడా చూస్తోందని ప్రతి అమ్మాయి తల్లి మీచర్యలను చూస్తున్నారని అయితే వారెవరూ మీమ్మిల్ని తిట్టాలని నేను కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ తెలియకండానే వారు చేసే శాపానార్థాలు పెడితే అది ప్రమాదకరం అని భావించాలని, ఖర్మను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తాను సంధిస్తున్న ప్రశ్నల నుంచి దృష్టి మళ్ళించడానికే తనపై అన్నామలై వ్యక్తిగత దాడి చేయిస్తున్నాడని ఆర్థం అవుతోందన్నారు.

పార్టీ చుట్టే ఆలోచనలు:

బీజేపీని వీడి 25 రోజులు కావొస్తున్నా సోషల్ మీడియా ద్వారా ఏదో రూపంలో బీజేపీ పేరునే తలుస్తున్నారు గాయత్రి రఘురాం. ఓ వైపు అన్నామలై ని విమర్శించడం, ప్రశ్నిస్తూనే మరో వైపు నరేంద్ర మోడీ నిర్ణయాలను ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో గాయత్రి రఘురామ్ పార్టీని వీడినా ఆమె ఆలోచనలు ఇంకా బీజేపీ చుట్టే ఉన్నాయని అందువల్లే ఏదో కారణంతో బీజేపీ నామస్మరణ చేస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన ఆరోపణలపై ఓ నెటిజన్ స్పందిస్తూ బీజేపీని వీడిన తర్వాత బీజేపీ నేతల ఫొటోలు పెట్టి పబ్లిసిటీ కోరడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. 'దయచేసి చెత్త పోస్ట్ చేయకండి.

ఆరు నెలలు విరామం తీసుకుని మళ్లీ పార్టీలో చేరండి. అంతా మంచి జరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో గాయత్రి రఘురాం తీరు తమిళనాడు రాజకీయాల్లో హాట్ హాట్ గా మారిపోయింది.

సొంత ఎజెడాతో ముందుకు:

పార్టీని వీడినప్పటి నుంచి అన్నామలైనే టార్గట్ చేస్తున్న గాయత్రి రఘురాం త్వరలో సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14 నుంచి చెన్నై నుండి కన్యాకుమారి వరకు యాత్ర ప్రారంభించే ప్రణాళికలు వేసుకుంటున్నారు. తమిళనాడు ప్రజల మద్దతు మరియు ఆశీర్వాదంతో నా శక్తి యాత్ర ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు. తాను బీజేపీ నుండి బయటకు వచ్చాను కానీ తమిళులకు ఏదైనా మంచి పనులకు మద్దతు ఇస్తాను. ఎవరూ అయోమయానికి గురికావద్దంటూ ఆమె చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాయత్రి రవి తీరు పార్టీకి డ్యామేజ్ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News