సీఎం జగన్ దళిత ద్రోహి.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు
సీఎం జగన్ దళిత ద్రోహి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ హాయాంలో దళితుల కోసం డా.ఆర్ బిఅంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేశాం అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రూ.46వేల కోట్ల సబ్ ప్లాన్ ఎస్సీ ల కోసం ఖర్చు చేశారు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 80 శాతం దళితులు జగన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. అందుకే జగన్ రెడ్డి దళిత ద్రోహి అని విమర్శించారు. ఎస్సీలకు అన్ని రకాలుగా అన్యాయం చేశారు అని మండిపడ్డారు.
దళితుల మీద దాడులు చేయడమంటే వైసీపీ పేటెంట్ రైట్‌లా భావిస్తున్నారు అని విరుచుకుపడ్డారు. మాస్క్ పెట్టుకోలేదని డా. సుధాకర్ ను పిచ్చిగా ముద్ర వేసి చంపేశారు అని గుర్తు చేశారు. సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేయించారు అని ధ్వజమెత్తారు. దళితులను విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత టీడీపేకు దక్కుతుంది అని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో దళితులకు అమలు చేసిన పథకాలను రద్దు చేశారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.