అతీక్ మాదిరిగా నన్నూ కాల్చి చంపుతారేమో?: SP నేత ఆజం ఖాన్

యూపీలో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మాద్‌ను కాల్చి చంపిన మాదిరిగానే తనను కూడా కాల్చి చంపేస్తారేమనని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-04-29 10:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మాద్‌ను కాల్చి చంపిన మాదిరిగానే తనను కూడా కాల్చి చంపేస్తారేమనని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రామ్ పూర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నా నుంచి, నా పిల్లల నుంచి మీకేం కావాలి? ఎవరైనా వచ్చి మా తలపై కాల్చి మమ్మల్ని చంపేయాలని మీరు అనుకుంటున్నారా ? ఇక మిగిలింది అదొక్కటే అన్నారు. చట్టాన్ని కాపాడాలని, నిజాం-ఏ-హింద్‌ను రక్షించాలని పిలుపునిచ్చారు. కాగా 2019లో అజంఖాన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆయనకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు.

Tags:    

Similar News