షర్మిలపై పేటీఎం కుక్కల దాడి బాధాకరం.. : నారా లోకేష్

షర్మిలపై వైసీపీ పేటీఎం కుక్కలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఎవరికి పుట్టావని పెళ్లిళ్ల ఎన్ని అని మాట్లాడుతున్నారని, వీరిని ఇలాగే వదిలేస్తే వైఎస్ పరువు కూడా తీసేసే పరిస్థితి ఉందని టీడీపీ నేత నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-02-13 08:58 GMT

దిశ ప్రతినిధి, శ్రీకాకుళం : షర్మిలపై వైసీపీ పేటీఎం కుక్కలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఎవరికి పుట్టావని పెళ్లిళ్ల ఎన్ని అని మాట్లాడుతున్నారని, వీరిని ఇలాగే వదిలేస్తే వైఎస్ పరువు కూడా తీసేసే పరిస్థితి ఉందని టీడీపీ నేత నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శంఖారావంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పాతపట్నంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డికి ఒక శాపం ఉందని అది ఏంటంటే నిజం చెబితే ఆయన తల పగిలిపోతుందని అని అన్నారు. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. పాదయాత్రలో దొరికిన ప్రతి మహిళకు ముద్దులు పెట్టారని, తర్వాత గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.

జాబ్ క్యాలెంటర్ కాస్తా సాక్షి క్యాలెంటర్‌లా మారిందని ఎద్దేవా చేశారు. డీఎస్సీ వేస్తాం, బీసీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య, 6500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఎన్నికలకు ముందు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారని, ఇప్పుడు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని, పోస్టులు కూడా తక్కువే అన్నారు. 800 గ్రూప్ -2 పోస్టులకు 5 లక్షల మంది రాశారని, ఇది ప్రజలకు జగన్ రెడ్డి చేసిన మోసం కాదా? అని లోకేష్ ప్రశ్నించారు. రెండు నెలలు ఓపికపట్టండి.. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది.. ఏటా జాబ్ క్యాలెంటర్ ఇస్తాం.. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలలు ఓపిక పడితే అందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.

 బిల్డప్ బాబాయి సినిమా పోయింది

‘జగన్ బిల్డప్ బాబాయి. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది కాస్తా వైసీపీ నాయకులకు అంతిమయాత్ర అయింది. ఆ సినిమా చూడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. క్వార్టర్ ఇచ్చినా చూసే ప్రసక్తే లేదు.జగన్ రెడ్డి సైకో, హిట్లర్. మనం చేసిన మంచి పనులకు రంగులు వేసి తామే కట్టామని బిల్డప్ ఇస్తారు.మనం కొన్న భూమి పత్రాలపైనా జగన్ రెడ్డి ఫొటోలే. సర్వే రాళ్లపైనా జగన్ రెడ్డి బొమ్మ. మీ బిడ్డ, మీ బిడ్డ అని భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

 జగన్‌కు సవాల్

‘జగన్‌కు సవాల్ విసురుతున్నా... అవినీతి ఆరోపణలపై చర్చకు మేం సిద్ధం. మీరు సిద్ధమా? బాంబులకే భయపడని కుటుంబం మాది... కేసులకు భయపడతామా? నేను రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. తప్పు చేస్తే వచ్చి అరెస్ట్ చేసుకోండి.’ అని సవాల్ విసిరారు. సొంత అమ్మ, చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఇంటి నుంచి గెంటేశారు. ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తాడా? అని ప్రశ్నించారు.

 తెలుగుదేశం జనసేనల మధ్య చిచ్చుకు యత్నాలు.. నమ్మవద్దు

‘టీడీపీ-జనసేన మధ్యలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇరుపార్టీల పెద్దలు అభ్యర్థులను నిర్ణయిస్తారు. నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తాం. పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రిని పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం. రెండు నెలలు ఓపికపట్టండి. టీడీపీ-జనసేన ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది.’ అని స్పష్టం చేశారు.

Read More..

వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

Tags:    

Similar News