మహిళలకు ఆసరా పథకం ఓ వరం.. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్
మహిళలకు ఆసరా పథకం ఓ వరమని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ అన్నారు.
దిశ, నర్సీపట్నం: మహిళా సాధికారితే ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మంగళవారం ఎంపీడీవో కార్యాలయం, ఎన్టీఆర్ స్టేడియంలో మూడో విడత వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం మూడో విడత ఆసరా మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. మహిళలను లక్షాధికారులను చేసే దిశగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.
ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎంపీడీవో జయమాధవి, కమిషనర్ కనకారావు, వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.