ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కవిత ఆసక్తికర ట్వీట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా రెండు రోజుల ఈడీ విచారణ ఎదుర్కొన్న అనంతరం బుధవారం హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2023-03-22 12:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా రెండు రోజుల ఈడీ విచారణ ఎదుర్కొన్న అనంతరం బుధవారం హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అందరూ కలిసి రావాలని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేస్తూ.. 'ఈ నవరాత్రిన అడ్డంకులను ఛేదించడానికి మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి సాధికారత కల్పించడానికి కలిసి పని చేద్దాం' అని పిలుపునిచ్చారు.

ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం మహిళలు ఉన్నారని, చట్టసభల్లోనూ తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తాము ఎక్కువ కోరడం లేదని 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలన్నారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశంలోనే ఆమోదింపజేయాలనే డిమాండ్ ను కవిత ఇటీవల ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టారు. మోడీ సర్కార్ కు పూర్తి మెజార్టీ ఉన్నందునా ఈ బిల్లును వెంటనే ఆమోదింపచేయాలని, ఈ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె కోరుతున్నారు.

Tags:    

Similar News