మొదలైన కర్ణాటక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం, మాజీ సీఎం

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2023-05-10 02:49 GMT
మొదలైన కర్ణాటక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం, మాజీ సీఎం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక సీఎం బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం బొమ్మై హుబ్లీలో ఓటు వేయగా.. మాజీ సీఎం యడ్యూరప్ప శికారిపురలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 135 స్థానాలకు పైగా సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కాగా మొత్తం 224 స్థానాలకు గాను మొత్తం ఐదున్నర కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News