Prashanth Kishor : రాహుల్ గాంధీ మద్దతు కోరిన పీకే
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashanth Kishor) ఆదివారం బీపీఎస్‌సీ పరీక్షల(BPSC Exams)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashanth Kishor) ఆదివారం బీపీఎస్‌సీ పరీక్షల(BPSC Exams)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), బీహార్ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) మద్దతును కోరారు. ప్రశాంత్ కిశోర్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను వారిని అనుసరిస్తున్నానని, వారు విముఖంగా ఉన్నట్టయితే ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటానని అన్నారు. 'నేను ప్రజలకు ఒకటి స్పష్టం చేయదలచుకున్నాను. నా నిరాహార దీక్ష రాజకీయేతరమైనది. ఏ పార్టీ బ్యానర్ కింద దీనిని చేపట్టలేదు. గత రాత్రి 51 సభ్యులున్న యువకులు ఓ వేదిక 'యువ సంఘర్ష సమితి'(YSS)ని రూపొందించారు. అది ప్రశాంత్ కిశోర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నది. మద్దతు ఇచ్చే అందరికీ స్వాగతం, అది రాహుల్ గాంధీ అయినా సరే మరొకరైనా సరే, రాహుల్ గాంధీకి 100 ఎంపీలున్నారు, తేజస్వీ యాదవ్‌కి 70కి పైగా ఎంఎల్‌ఏలు ఉన్నారు. రాహుల్, తేజస్వి లాంటి నాయకులు తలచుకుంటే గాంధీ మైదాన్‌కు ఐదు లక్షల మందిని తేగలరు. బీహార్ యువకుల భవిష్యత్తు కోసం వారు సరైన నిర్ణయం తీసుకోవాలి' అని పీకే కోరారు.