Tirumala: శ్రీవారి సేవలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత..

నేడు ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్సించుకున్నారు.

Update: 2024-06-23 10:26 GMT

దిశ వెబ్ డెస్క్: నేడు ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి  అనిత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్సించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఆ దేవదేవున్ని, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా తిరుమల వచ్చినట్టు తెలిపారు. కాగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఊపిరిపీల్చుకునే పరిస్థితిని ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్లలో పడిన కష్టాలు మళ్లీ పడకుండా, కచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో, లోకేష్ ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, ఎన్‌డిఏ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని వెల్లడించారు.

అలానే ఆ దేవదేవుని ఆశీసులతో చంద్రబాబు నాయుడు తనని నమ్మి తనకు హోంమినిస్టర్ పదవి ఇవ్వడం జరిగిందని, తనపైన పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టిపరిస్థితిలోనూ, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చూపకుండా నెరవేరుస్తానని మనస్పూర్తిగా తెలియజేస్తున్నా అని అన్నారు. కాగా ప్రస్తతం హోం డిపార్ట్‌మెంట్ ఎంత స్పీడుగా ఉందో మీ అందరికీ తెలుసని, ఇటీవల చీరాలలో ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్పంధించి వేంటనే తనని అక్కడికి పంపించారని తెలిపారు. ఈ క్రమంలో కోన్ని గంటల్లోనే తాను ఘటనా స్థలానికి చేరుకుని, ఘటనా స్థలాన్ని పరిశీలించి, నేరస్తులను 48 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. తన ఆదేశాల మేరకు పోలీసులు కేవలం 36 గంటల సమయంలోనే నేరస్తులను పట్టుకుని వాళ్లను అరెస్ట్ చేయడం సైతం జరిగిందని తెలిపారు. కాగా ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల భద్రతకు ఎంత భరోసా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అమె పేర్కొన్నారు.

సంగట జరగకుండా చూడాల్సిన బాధ్యత, అలానే మాదకద్రవ్యాలను అరికట్టాల్సి బాధ్యత సైతం తమపైన ఉంది తెలిపారు. అలానే రాబోయే కాలంలో వాటిని కచ్చితంగా నివారిస్తామని హామీ ఇచ్చారు. ఇక గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు వచ్చిన భక్తులు ఎంత ఇబ్భంది పడ్డారో ప్రజలకు సైతం తెలుసని అన్నారు. ఇప్పుడు భక్తులు తన దగ్గరకి వచ్చి అమ్మ మీ ప్రభుత్వం అయినా తిరుమలను బాగుచేయమని కోరుతుంటే గత ఐదేళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరనికి, అవినీతి, అక్రమాలకు భక్తులు ఎన్ని ఇంబ్భందులను ఎదుర్కొన్నారో అర్థం అవుతుందని అన్నారు.


Similar News