CPI: మోడీ తన స్వచ్ఛతను చాటుకుంటాడా..? సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

అదానీ(Adani)ని అమెరికా(America) శిక్షించే విషయంలో ప్రధాని మోడీ(PM Modi) తన స్వచ్ఛతను(Purity) చాటుకుంటాడా? అని సీపీఐ నేత నారాయణ(CPI Leader Narayana) ప్రశ్నించారు.

Update: 2024-11-24 07:18 GMT

దిశ, వెబ్ డెస్క్: అదానీ(Adani)ని అమెరికా(America) శిక్షించే విషయంలో ప్రధాని మోడీ(PM Modi) తన స్వచ్ఛతను(Purity) చాటుకుంటాడా? అని సీపీఐ నేత నారాయణ(CPI Leader Narayana) ప్రశ్నించారు. అదానీపై కేసు(Adani Case) అంశంలో స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. అమెరికా దేశంలోని న్యూయార్క్ కోర్టు(Newyark Court)లో భారతదేశ కార్పోరేట్ దిగ్గజం అదానీ(Indian corporate giant Adani)పై లంచం(Bribery) ఇచ్చిన కేసు నమోదు అయ్యిందని, ఈ కేసును అమెరికా త్వరగా పూర్తి చేస్తుందని తెలిపారు.

ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) ప్రకంపనలు సృష్టించిందని, ఈ అవినీతి గత జగన్ ప్రభుత్వం(YS Jagan Govt)పై పడి, అటునుంచి ఢిల్లీ(Delhi)కి చేరిందని అన్నారు. దీనిపై అమెరికన్ గవర్నమెంట్(American Govt) చర్యలు తీసుకుంటుందా..? లేక మోడీ దీనికి అడ్డం పడతారా వేచి చూడాలని అన్నారు. అలాగే అమెరికా చర్యలు తీసుకొని అదానీని శిక్షిస్తే అమెరికా ప్రభుత్వం నిజాయితీ నిలబడుతుందని, మోడీ అడ్డం పడకపోతే మోడీకి స్వచ్ఛందత వస్తుందని వ్యాఖ్యానించారు. ఇది అటు ఇటు కాకుండా జరిగి అమెరికా, మోడీ కుమ్మక్కు అయ్యి ఈ అవినీతిని రూపుమాపడానికి ప్రయత్నించే అవకాశం ఉందని, ఇది జరగకుండా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని నారాయణ భావించారు.

Tags:    

Similar News