Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి పోలీసులు నోటీసు(Notice)లు జారీ చేశారు
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి పోలీసులు నోటీసు(Notice)లు జారీ చేశారు. దళిత బంధు రెండవ విడత డబ్బులు విడుదల చేయాలంటూ ఈ నెల 9వ తేదీన హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అయితే ధర్నా, రాస్తారోకోకు కౌశిక్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం వివాదస్పమైంది. అనుమతులు లేకుండా ధర్నా, రాస్తారోకో చేసినందుకు సెక్షన్ 35(3) బీఎన్ఎస్ యాక్టు మేరకు ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీ నుంచి ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడంలో ముందుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా బొగ్గు బూడిద రవాణాలో అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానాలపై కూడా తరుచూ అసెంబ్లీ బయట, లోపల, మీడియా సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి ముందుంటూ విమర్శలు చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదంలోనూ కౌశిక్ రెడ్డినే అరికపూడి గాంధీతో సవాళ్ల వివాదం సాగించారు. కోర్టులో పిటీషన్ సైతం వేశారు.