పేపర్ లీకేజీ లు బీజేపీ కుట్రే: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

‘అన్ని ప్రతిపక్షాల కూటమికి నన్ను చైర్ పర్సన్ ను చేయండి..2024 పార్లమెంట్ ఎన్నికల.... BRS MLAs Fire on Modi, Bandi Sanjay

Update: 2023-04-04 14:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అన్ని ప్రతిపక్షాల కూటమికి నన్ను చైర్ పర్సన్ ను చేయండి..2024 పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం ఖర్చును చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని’ కేసీఆర్ తన స్నేహితులతో చెప్పిన విషయాన్ని సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ యూటూబ్ ఛానెల్ లో పోస్టు చేయడంపై మీడియా బీఆర్ఎస్ నేతలను ప్రశ్ని్ంచారు. సర్దేశాయ్ జడ్జీకాదు.. ఆయన రాజ్యాంగ వ్యవస్థ కూడా కాదు... ఆయనవి అర్ధం లేని కామెంట్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ టెన్త్ పేపర్ లీకేజీలు బీజేపీ కుట్రే అని క్రమంగా అర్ధమవుతోందన్నారు. మోడీ చదివిన చదువును అడిగే తప్పేముందని ప్రశ్నించారు. ఆయన సమాజాన్ని చదివితే ప్రజాసమస్యలు అయినా పరిష్కరించబడేవన్నారు. అవినీతితో దేశం ఐదోస్థానంలో నిలిచిందని ఆరోపించారు. చేయనది చేసినట్లు చెప్పుకోవడం బీజేపీకే చెల్లిందన్నారు.

బండి పేపర్ లీకేజీపై.. విద్యార్థుల పక్షాన పోరాడాలే గానీ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. సంజయ్ లాంటి అర్హత లేనోడికి స్థాయికి మించిన పదవి వస్తే ఇలానే ఉంటుందని మండిపడ్డారు. వందే భారత్ రైలును ప్రధాని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మోడీకి చెప్పి పింఛన్లు, కల్యాణ లక్ష్మి పథకం పెంచేలా చూడాలని బండికి హితవు పలికారు. సంజయ్ నిరుద్యోగ లాంగ్ మార్చ్ చేస్తే ఢిల్లీలో చేయాలని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిపై ఢిల్లీ లో లాంగ్ మార్చ్ చేయాలని, ఎంపీగా తెలంగాణ గురించి పార్లమెంటులో సంజయ్ నోరు విప్పారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సంజయ్ జాగీరు.. మోడీ జాగీరు కాదని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సంజయ్ నాలుకను ప్రజలే చీరుస్తారని హెచ్చరించారు. బీజేపీ బెదిరింపులకు కేసీఆర్, కేటీఆర్, కవితలు భయపడరన్నారు. కేటీఆర్, కవితలు మోడీ లాగా పారాచుట్ నేతలు కారన్నారు. బండి నోరు అదుపులో పెట్టుకోవాలని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ప్రాణాలు కాపాడే మందులపై కేంద్రం పన్నులు వేయడం దుర్మార్గం అన్నారు. మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత బీజేపీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. తెలంగాణకు ఏం ఇచ్చారని మోడీ సహా బీజేపీ అగ్ర నేతలు హైదరాబాద్ కు వస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధించాలని, గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని.. దానిపై ఈ నెల 8న మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు బీజేపీ పనికొచ్చే పని బీజేపీ ఒక్కటైనా చేసిందా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలపై బీజేపీ నేతల కుట్రలు త్వరలోనే బయటకు వస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ వ్యూహాలను ఎదిరించే శక్తి ఒక్క కేసీఆర్ కే ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News