బీజేపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి ఆ పార్టీ నేత రాజీనామా

కర్ణాటకలో బీజేపీ నేత పుట్టన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

Update: 2023-03-09 15:30 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. నాలుగేళ్ల పదవీ కాలం మిగిలుండగానే ఓ బీజేపీ ఎమ్మెల్సీ రాజీనామా చేశాడు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టన్న అనే వ్యక్తి రెండేళ్ల కిందట బీజేపీ తరఫున టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇవాళ విధాన పరిషత్ చైర్మన్ ను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్సీ పుట్టన్న రాజీనామాపై కాంగ్రస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పందిస్తూ.. కర్ణాటకలో యువత, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, అది చూడలేకే ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నా కూడా పుట్టన్న తన పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. వీరోచిత నిర్ణయం తీసుకున్న పుట్టన్నకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన పుట్టన్న భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతారనే ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News