మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో భర్తల హాజరు..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు మండల స్థాయి సమావేశంలో మహిళా సర్పంచ్ ల స్థానంలో వారి భర్తలు హాజరవడం గమనార్హం.
దిశ, ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు మండల స్థాయి సమావేశంలో మహిళా సర్పంచ్ ల స్థానంలో వారి భర్తలు హాజరవడం గమనార్హం. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మహిళల స్థానంలో వారి భర్తలు లేదా కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలకు హాజరవడం నిబంధనలకు విరుద్ధమని పంచాయతీరాజ్ కమిషనర్ హెచ్చరించినప్పటికీ భర్తల పెత్తనం ఆగడం లేదు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల మండల స్థాయి అవగాహన సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు పాల్గొనగా అధికారులు సైతం మౌనం వహించి, సభను నిర్వహించడంతో మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు