బండి సంజయ్ అరెస్ట్.. పోలీసులపై కిషన్ రెడ్డి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ పాదయాత్ర ఆపి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారం చేజారిపోతోందన్న భయంతోనే బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ విపరీత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయలేకపోతున్నాననే బాధ కేసీఆర్ ఏర్పడిందని ఎద్దేవా చేశారు.