Maharashtra: ‘మహా’ పాలిటిక్స్‌లో మరో సంచలనం.. చివరి క్షణంలో ట్విస్ట్ ఇచ్చిన షిండే

మహారాష్ట్ర రాజకీయా(Maharashtra politics)ల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-12-04 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయా(Maharashtra politics)ల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధుల సమక్షంలో మహాయుతి కూటమి(mahayuti alliance) మధ్య విభేదాలు బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం పదవిని మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) నిరాకరించారు. తన నిర్ణయాన్ని సాయంత్రం చెబుతానని షిండే నిండు ప్రెస్మీట్‌లో చెప్పడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్‌(Ajit Pawar )లు షిండేను బతిమిలాడారు.

అనంతరం అజిత్ పవార్‌పై షిండే ఫైర్ అయ్యారు. ‘నీలా పూటకోమాట మాట్లాడటం నాకు చేతకాదు’ అని అజిత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి పీఠంపై శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే పట్టువీడకపోవడం.. మరోవైపు బీజేపీ పెద్దలు మాత్రం ఎక్కువ సీట్లు వచ్చిన తమకే సీఎం పదవి తీసుకుంటామని చెప్పారు. చివరకు అంతా అనుకున్నట్టే జరిగింది అనుకున్న సమయంలో షిండే ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News