KTR: కొంత మేరకే చేసుకున్నాం.. అయినా సక్సెస్ అయ్యాం

వచ్చే ఏడాది నుంచి దీక్షా దివస్(నవంబర్‌29) నుంచి మొదలు విజయ్ దివస్‌ (డిసెంబర్‌ 9) వరకు 11 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

Update: 2024-12-04 16:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది నుంచి దీక్షా దివస్(నవంబర్‌29) నుంచి మొదలు విజయ్ దివస్‌ (డిసెంబర్‌ 9) వరకు 11 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమాల నిర్వహణకు పార్టీ తరపున రెండు డెడికేటెడ్ కమిటీలను నియమిస్తామన్నారు. రచయితలు, సాహితివేత్తలు ఒకవైపు, కవులు, కళాకారులతో కూడిన బృందాలను నియమిస్తామని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కేసీఆర్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సంస్కృతిపరంగా, భాషపరంగా తెలంగాణ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కొంత మేరకు చేసుకున్నాం.. విజయవంతం అయ్యామన్నారు. ఒక బతుకమ్మ పండుగగానీ, బోనాల పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నామని, తెలంగాణ భాష, యాస ఔన్నత్యాన్ని సిలబస్‌ లో పెట్టుకున్నామని మహానీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశామన్నారు. రసమయి బాలకిషన్‌‌కు సాంస్కృతిక సారధి బాధ్యతలు అప్పగించి కెబినెట్ హోదా ఇచ్చి అందులో దాదాపు 500 మంది కవులు, కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చామన్నారు.

అధికారం శాశ్వతం కాదు... తెలంగాణ శాశ్వతం, తెలంగాణ చరిత్ర శాశ్వతం అన్నారు. తెలంగాణ గొప్పతనం శాశ్వతంగా నిలవాలన్న ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణ లిట్‌ రేచర్ డే, ఫెస్టివల్‌ 11 రోజుల సందర్భంగా హైదరాబాద్, వరంగల్‌ కేంద్రంగా నిర్వహిస్తామన్నారు. సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు చేస్తామన్నారు. సింహాలు చరిత్రను చెప్పుకోకుంటే..వేటగాళ్లు చెప్పేవే చరిత్రగా నిలిచిపోయేయ ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ మీదున్న కోపంతో మాటల దాడి చేయండి... కానీ ఆకోపంతో తల్లి రూపాన్నే మారిస్తే చరిత్ర క్షమించదన్నారు. విజ్ఞతతో విరమించుకోవాలని సూచించారు. సుసంపన్నమైన తెలంగాణ తల్లిని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని సీఎం చూస్తున్నాడని దుయ్యబట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. సీఎం ఆటలు ఎంతోకాలం సాగబోవన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాలకు అంధించేందుకు కృషి చేస్తామన్నారు.

Tags:    

Similar News