FIR: బీఆర్ఎస్ MLA కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station)లో కేసు నమోదైంది.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station)లో కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి సహా మొత్తం 20 మంది బీఆర్ఎస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయింది. విధులను అడ్డగించి బెదిరింపులకు గురిచేశాడని బంజారాహిల్స్ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సీఐ బయటకు వెళ్లిపోతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో కూర్చున్న సీఐతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల నిరసనతో కారు దిగి సీఐ తన ఛాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ సీఐ, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.