Maharashtra: వీడిన ఉత్కంఠ.. ఫడ్నవీస్ రిక్వెస్ట్‌కు షిండే గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) అంగీకరించారు.

Update: 2024-12-04 13:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) అంగీకరించారు. షిండే ఇంటికి వెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis) జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఫడ్నవీస్‌తో చర్చించిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు షిండే అంగీకరించారు. కాగా, అంతకుముందు.. మీడియా ముందే విభేదాలు బయటపెట్టుకున్నారు.

అజిత్‌ పవార్‌(Ajit Pawar)ను లక్ష్యంగా చేసుకుని షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీరు, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అని షిండేను మీడియా ప్రశ్నించగా.. దీనిపై నిర్ణయం కొలిక్కి రావాలంటే సాయంత్రం వరకు వేచి చేయాల్సిందేనని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో అజిత్ పవార్‌ జోక్యం చేసుకుంటూ.. తానైతే ప్రమాణ స్వీకారం చేస్తానని వ్యాఖ్యానించారు. దీంతో అజిత్‌పై షిండే ఫైర్ అయ్యారు. అనంతరం ఫడ్నవీస్, షిండే రహస్యంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు.

Tags:    

Similar News