Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో హిందువులపై నరమేధంలో యూనుస్ పాత్ర : షేక్ హసీనా

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న నరమేధం(Genocide)లో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్(Muhammad Yunus) పాత్ర కూడా ఉందని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆరోపించారు.

Update: 2024-12-04 19:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న నరమేధం(Genocide)లో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్(Muhammad Yunus) పాత్ర కూడా ఉందని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆరోపించారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో యూనుస్ విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చేసిన హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా ప్రసంగించారు.

‘‘మా నాన్న షేక్ ముజిబుర్ రహ్మాన్‌లాగే నన్ను, నా సోదరి షేక్ రేహానాలను అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయి’’ అని హసీనా ఆరోపించారు. ‘‘నేను బంగ్లాదేశ్ ప్రధానిగా చివరి రోజు అధికారిక నివాసంలో ఉండగా పెద్దసంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారు. నేను ఒక్క ఆదేశమిస్తే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపేవారు. అదే జరిగితే చాలామంది చనిపోయేవారు. ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను 25 నుంచి 30 నిమిషాల్లోగా ఢాకా నుంచి బయలుదేరి భారత్‌కు వచ్చేశాను’’ అని హసీనా గుర్తు చేసుకున్నారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా బంగ్లాదేశ్ పరిస్థితులను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News