‘పుట్ట’ అరెస్ట్ అయితే.. చాన్స్ ఎవరికీ!

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుట్ట మధు అరెస్ట్ అయితే ఆయన జడ్పీ ఛైర్మన్ పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లాలో ఆశావాహులు అధిష్టానం వద్ద క్యూ కట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. పుట్ట మధు అరెస్ట్‌తో జిల్లాలో రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశావహుల జాబితాలో జూలపెల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనారాయణ, ముత్తారం జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, […]

Update: 2021-05-08 08:10 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుట్ట మధు అరెస్ట్ అయితే ఆయన జడ్పీ ఛైర్మన్ పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లాలో ఆశావాహులు అధిష్టానం వద్ద క్యూ కట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. పుట్ట మధు అరెస్ట్‌తో జిల్లాలో రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆశావహుల జాబితాలో జూలపెల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనారాయణ, ముత్తారం జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, రామగిరి జడ్పీటీసీ మాదరవేని శారదలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పుట్ట మధును ప్రభుత్వమే తొలగిస్తుందా లేక ఆయనే రాజీనామా చేస్తారా..? అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ అధిష్టానం నిర్ణయంతో తమ భవితవ్యం తేల్చుకోవాలని చూస్తున్నారు. పోలీసు కస్టడిలో పుట్ట మధు ఉన్నాడని వెలుగులోకి రాగానే జడ్పీ ఛైర్మన్ పదవి కోసం పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News