పొత్తులు లేదా పై ఎత్తులు.. తమిళనాడులో పొలిటికల్ హీట్
దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో పాలిటిక్స్ ఒక్క సారిగా హీటెక్కుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పొలిటికల్ పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పొత్తుల కోసం పలు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా పొత్తులకు పై ఎత్తులు వేసేందుకు పార్టీలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో నడుస్తున్న పొత్తుల పంచాయితి గురించి తెలుసుకునేందుకు రీడ్ […]
దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో పాలిటిక్స్ ఒక్క సారిగా హీటెక్కుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పొలిటికల్ పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పొత్తుల కోసం పలు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా పొత్తులకు పై ఎత్తులు వేసేందుకు పార్టీలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో నడుస్తున్న పొత్తుల పంచాయితి గురించి తెలుసుకునేందుకు రీడ్ దిస్ స్టోరీ
ఎన్నికల షెడ్యూల్ వెలుపడిన వెంటనే బీజేపీ దూకుడు పెంచింది. తమిళనాడు ఎన్నికల్లో పొత్తులపై తేల్చుకునేందుకు అమిత్ షా ఆదివారం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ ఎన్నికల పర్యవేక్షకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ రాష్ట్ర సీఎం పళనీస్వామితో కిషన్ రెడ్డి శనివారం కీలక భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే పొత్తులపై ఇరు పార్టీల మధ్య కీలక చర్చలు నడుస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆదివారం అమిత్ షాతో జరిగే సమావేశంలో ఇరు పార్టీల పొత్తుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కాగా మరో వైపు మక్కల్ నీధి మయ్యం పార్టీ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకే నుంచి వైదొలిగిన శరత్ కుమార్ ఎస్ఎంకే పార్టీతో కమల్ హాసన్ చర్చలు జరుపుతున్నారు. ఐజేకే పార్టీకి చెందిన రవిబాబు కూడా కమల్‌తో పొత్తుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్‌తో కమల్ హాసన్ శనివారం భేటీ అయ్యారు. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ రెండు వర్గాల మధ్య చర్చలు ఫలితం ఎలా ఉండబోతుందన్న విషయం మరి కొద్ది గంటల్లో తెలియనుంది.
ఇక మరో ప్రధాన పార్టీ డీఎంకే కూడా పొత్తుల విషయంలో కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతోంది. కాగా తమకు 54 సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో సీట్ల పంపకంపై డీఎంకే పార్టీ ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అటు మక్కల్ నీది మయ్యమ్, ఇటు బీజేపీలు పొత్తుల విషయంలో వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో డీఎంకే కూడా సాధ్యమైనంత త్వరగా పొత్తుల లెక్కలను క్లియర్ చేసుకోవాలని ఆలోచనలో ఉంది.
కాగా పొత్తులో భాగంగా 50 స్థానాలను బీజేపీ కోరుతున్నది. దానిపై అన్నాడీఎంకే మాత్రం కొంత అనాసక్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే బీజేపీకి హ్యండ్ ఇచ్చి మరో పార్టీతో పొత్తులకు వెళ్లాలని అన్నాడీఎంకే నేతలు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటు సీట్ల పంచాయితీ విషయంలో కాంగ్రెస్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఏం కొంచెం తేడా వచ్చిన తన దారి తాను చూసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్నట్టుగా ఆయా పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయా లేదా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఏ క్షణంలో ఏ పార్టీ ఎటు వైపు తిరుగుతుందో.. పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయో అన్న అంశంపై అంతటా ఉత్కంఠ మొదలైంది.