ఏవోబీ సరిహద్దులో భారీ డంప్
దిశ, విశాఖపట్నం: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను గురువారం ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం ప్రకారం మల్కన్‌గిరి జిల్లా కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని అరపదర్-ఆండ్రాపల్లి అటవీప్రాంతంలో గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ ఒడిశా పోలీసులు.. మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను కనుక్కున్నారు. ఈ డంప్‌లో రెండు మందుపాతరలు, 14 హ్యాండ్ గ్రైనెడ్‌లు,13 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 9 ఎంఎం పిస్టల్ కు చెందిన […]
దిశ, విశాఖపట్నం: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను గురువారం ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం ప్రకారం మల్కన్‌గిరి జిల్లా కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని అరపదర్-ఆండ్రాపల్లి అటవీప్రాంతంలో గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ ఒడిశా పోలీసులు.. మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను కనుక్కున్నారు.
ఈ డంప్‌లో రెండు మందుపాతరలు, 14 హ్యాండ్ గ్రైనెడ్‌లు,13 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 9 ఎంఎం పిస్టల్ కు చెందిన 55 రౌండ్స్, 303 తుపాకీకి చెందిన 93 రౌండ్స్ ఉన్నట్లు ఒడిశా మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. ఏవోబీ ఎస్‌జడ్‌సీకు చెందిన మావోయిస్టులకు చెందిన సామగ్రీగా గుర్తించామని, వీటిని అమాయకులైన గిరిజనులను లక్ష్యంగా చేసుకోవడంతో బాటు గాలింపుకు వచ్చే బలగాలను లక్ష్యంగా చేసుకుని వీటిని వాడటానికి దాచిపెట్టారని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు.