మూడడుగులు.. మూడ్రోజులు
దిశ, ఆందోల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు నిరాడంబరంగా నిర్వహించుకోవాలని, మూడ్రోజుల్లోనే నిమజ్జనాలు చేయాలని జోగిపేట సీఐ తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవ సమితి, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… కరోనా వ్యాప్తి కారణంగా గణేష్ ఉత్సవం నిరాడంబరంగా నిర్వహిచాలని నిర్ణయించారు. గణేష్ విగ్రహం ఎత్తు మూడు అడుగులకు మించి ఉండకూడదని, పూజ కార్యక్రమంలో పూజరితో పాటు కమిటీ సభ్యులు ఇద్దరు మాత్రమే […]
దిశ, ఆందోల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు నిరాడంబరంగా నిర్వహించుకోవాలని, మూడ్రోజుల్లోనే నిమజ్జనాలు చేయాలని జోగిపేట సీఐ తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవ సమితి, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… కరోనా వ్యాప్తి కారణంగా గణేష్ ఉత్సవం నిరాడంబరంగా నిర్వహిచాలని నిర్ణయించారు.
గణేష్ విగ్రహం ఎత్తు మూడు అడుగులకు మించి ఉండకూడదని, పూజ కార్యక్రమంలో పూజరితో పాటు కమిటీ సభ్యులు ఇద్దరు మాత్రమే ఉండాలని, అంతేగాకుండా భక్తులకెవరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వకూడదన్నారు. అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. 24వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపే నిమజ్జనం పూర్తి చేయాలని, సౌండ్ సిస్టం, బ్యాండ్‌ను పూర్తిగా నిషేదిస్తున్నట్టు తెలిపారు.