హేమంత్ కుటుంబానికి పోలీసుల రక్షణ

దిశ, క్రైమ్ బ్యూరో : హేమంత్ హత్య కేసులో ఏ1 యుగేందర్ రెడ్డి, ఏ2 లక్ష్మారెడ్డిలను రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 18 మంది పాల్గొనగా, ఇంకా ఎంతమంది ఈ కేసుతో ప్రమేయం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. అంతే కాకుండా, మరో గ్యాంగ్ కు సుఫారీ విషయమై మాట్లాడాలని అనుకున్నట్టుగా వస్తున్న అంశాలపై కూడా రెండో రోజు విచారణలో యుగేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా […]

Update: 2020-10-02 04:57 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : హేమంత్ హత్య కేసులో ఏ1 యుగేందర్ రెడ్డి, ఏ2 లక్ష్మారెడ్డిలను రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 18 మంది పాల్గొనగా, ఇంకా ఎంతమంది ఈ కేసుతో ప్రమేయం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. అంతే కాకుండా, మరో గ్యాంగ్ కు సుఫారీ విషయమై మాట్లాడాలని అనుకున్నట్టుగా వస్తున్న అంశాలపై కూడా రెండో రోజు విచారణలో యుగేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మిర్యాలగూడెం తర్వాత అంతటి సంచలనాత్మకమైన కేసు కావడంతో ఈ కేసు కస్టడీ విచారణ అంతా కూడా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోణంలోనే నిందితులను ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. అయితే, సీన్-రీకన్‌స్ట్రక్షన్ శుక్రవారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మా అమ్మానాన్నల నుంచి తనుకూ, తన అత్తమామలకు ప్రాణహాని ఉందంటూ హేమంత్ భార్య సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి వినతిపత్రం అందించారు. దీంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు చందానగర్ పోలీసులు హేమంత్ తల్లిదండ్రులు, భార్య, సోదరుడు నివసించే చందానగర్ లో స్థానిక చందానగర్ పోలీసుల ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.

Tags:    

Similar News