తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్..

దిశ, పటాన్ చెరు: తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పటాన్ చెరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి, క్రైమ్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం…నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామానికి చెందిన తిప్పరాజు రామకృష్ణ (30).. ఈనెల 19, 20 తేదీల్లో పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంటి తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి వస్తువులను దొంగిలించాడు. […]

Update: 2020-11-24 10:11 GMT

దిశ, పటాన్ చెరు: తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పటాన్ చెరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి, క్రైమ్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం…నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామానికి చెందిన తిప్పరాజు రామకృష్ణ (30).. ఈనెల 19, 20 తేదీల్లో పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంటి తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి వస్తువులను దొంగిలించాడు. పట్టణంలో మంగళవారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతు రామకృష్ణ కనిపించాడు.

దీంతో అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించారు. విచారణలో అసలు నిజాలను అతను చెప్పాడు. కాగా ఇంతకు ముందు చైతన్యపురి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. గతంలోనూ హైదరాబాద్. సైబరాబాద్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 20 చోరీ కేసుల్లో నిందితుడుగా ఉండి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. నిందితుని వద్ద నుంచి 4.5 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను, ఇంటి తాళాలు పగులగొట్టే పనిముట్లను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News