కోడి పందాల స్థావరాలపై దాడులు

కోడి పందాల స్థావరాలపై దాడి చేసిన పోలీసులు పలువురు జూదర్లను అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-01-14 14:12 GMT
కోడి పందాల స్థావరాలపై దాడులు
  • whatsapp icon

దిశ, కౌటాల : కోడి పందాల స్థావరాలపై దాడి చేసిన పోలీసులు పలువురు జూదర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జనగం గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ మధుకర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది జూదరులను అదుపులోకి తీసుకొని మూడు కోడి పుంజులు, రూ. 3900 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై మధుకర్ తెలిపారు.


Similar News