మల్యాలలో అర్ధరాత్రి దొంగతనం
గత వారం రోజుల క్రితం మల్యాలలో అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగిన కేసును మల్యాల పోలీసులు ఛేదించారు.
దిశ, మల్యాల : గత వారం రోజుల క్రితం మల్యాలలో అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగిన కేసును మల్యాల పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్యాల గ్రామంలోని మల్యాల మంజుల ఇంట్లో గత వారం రోజుల క్రితం దొంగతనం జరగగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మల్యాలకు చెందిన మ్యక మహేష్ ,కుంద బాబు నిందితులుగా గుర్తించి వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి సుమారు మూడున్నర తులాల బంగారం, రెండు సెల్ఫోన్లను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ తెలిపారు.