తల్లి మందలించిందని యువకుడు ఆత్మహత్య
పురుగుల మందు సేవించి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెజ్జూర్ లో మంగళవారం జరిగింది.
దిశ, బెజ్జూర్ : పురుగుల మందు సేవించి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెజ్జూర్ లో మంగళవారం జరిగింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం బెజ్జూరు గ్రామానికి చెందిన కావిడ నవీన్ (25) మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. నవీన్ గత కొన్ని రోజులుగా తాగుడుకు బానిస కావడంతో తల్లి మంగళవారం మందలించడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.