Crime News : అథ్లెట్ పై లైంగిక దాడి.. 44 మంది అరెస్ట్

కేరళ(Kerala)లో అథ్లెట్ పై జరిగిన లైంగిక దాడి(Sexual assault on an athlete) ఘటనలో 44 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-01-14 13:10 GMT
Crime News : అథ్లెట్ పై లైంగిక దాడి.. 44 మంది అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : కేరళ(Kerala)లో దళిత అథ్లెట్ పై జరిగిన లైంగిక దాడి(Sexual assault on an athlete) ఘటనలో 44 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఐదుళ్లుగా తనపై జరుగుతున్న దారుణాలను బాధితురాలు శిశు సంక్షేమ కమిటీ కౌన్సెలింగ్ లో కన్నీళ్లతో మొరపెట్టుకోగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఈ కేసు విచారించేందుకు సిట్(SIT) ను ఏర్పాటు చేసింది. మొత్తం 60 మంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు తెలపగా.. ఇందుకు సంబంధించి ఏకంగా 30 ఎఫ్ఐఆర్(FIR) లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 44 మందిని అరెస్ట్ చేయగా.. మరో 13 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. మరో ఇద్దరు విదేశాల్లో ఉండగా.. వారిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వారిలో పొరుగువారు, స్నేహితులు, కోచ్ లు, తోటి అథ్లెట్లు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు తెలిపారు. నిందితులు ఎంతటివారైన వదిలేది లేదని, అన్ని ఆధారాలతో సహ చట్టం ముందు నిలబెడతామని కేరళ డీఐజీ అజీతా బేగం తెలియజేశారు. 

Tags:    

Similar News