ఆదిలాబాద్‌లో నకిలీ విత్తనాలు పట్టివేత

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. సిరికొండ ఎస్సై ఫరిద్ వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇంద్రవెల్లి మండలం నుంచి ఇచ్చోడా వైపు వెళుతున్న బైక్‌ను గాంధీ చౌక్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో వారి వద్ద ఉన్న సంచిలో దాదాపు 50 ప్యాకెట్ల నిషేధిత బీటీ విత్తనాలు లభించాయి. వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులు విచారణ […]

Update: 2020-05-22 00:35 GMT

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. సిరికొండ ఎస్సై ఫరిద్ వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇంద్రవెల్లి మండలం నుంచి ఇచ్చోడా వైపు వెళుతున్న బైక్‌ను గాంధీ చౌక్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో వారి వద్ద ఉన్న సంచిలో దాదాపు 50 ప్యాకెట్ల నిషేధిత బీటీ విత్తనాలు లభించాయి. వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను గుర్తించారు. ఉమేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్, అశ్విన్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News